You are here

Back to top

Think Again: The Power of Knowing What You Don't Know (Paperback)

Think Again: The Power of Knowing What You Don't Know Cover Image
$20.99
Usually Ships in 1-5 Days

Description


వేగంగా మారుతున్న ప్రపంచంలో బాగా ఆలోచించగలిగే నైపుణ్యం అనేది వరం. ఎప్పుడూ ఒక అభిప్రాయానికి, లేదా ఒక ఆలోచనకు కట్టుబడకూడదు, పునరాలోచించుకోవటానికి సిద్ధపడాలి అని ఈ పుస్తకం మనకు చెబుతుంది. చాలా మంది తమకు అసౌకర్యం కలిగించే ఆలోచనలు చేయటానికి భయపడతారు. తమ విశ్వాసాలను,అభిప్రాయాలతో ఏకీభవించని వాళ్లకు దూరంగా మసలుతారు. ఒక పనిని తమకు అలవాటయిన పద్ధతిలో యాంత్రికంగా చేసుకుపోతారు. కొత్తగా ప్రయత్నించటానికి సందేహిస్తారు. ఒక పనిని నేర్చుకునే అవకాశంగా కాకుండా, మన అహంకారానికి ముప్పుగా భావిస్తాం. దానితో నమ్మకాలు అనేవి పెళుసుగా తయారవుతాయి. కొత్తగా నేర్చుకోవటం ఆగిపోతుంది. నిరంతరం మన అభిప్రాయాలను సమర్థించుకోవటానికి.. ఓ మత ప్రభోధకునిలా, ఓ న్యాయవాదిగా, ఓ రాజకీయవేత్తగా అవతారమెత్తుతాం. శాస్త్రవేత్తలా వ్యవహరించటానికి మాత్రం ఇష్టపడం. తమకు లభించే కొత్త దత్తాంశాల ఆధారంగా శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను మార్చుకుంటారు. తాము పొరపాటు అవకాశం ఉందనే వారి స్వభావం.. పునరాలోచనకు వారిని సిద్ధం చేస్తుంది. మీరు కూడా మీ వృత్తివ్యాపారాల్లో విజయం సాధించదలుచుకుంటే పునరాలోచన అన్న కళలో రాణించాలి. ఆ విద్య అలవడటానికి ఈ పుస్తకం మీరు తప్పక చదవితీరవలసిందే

Product Details
ISBN: 9789355432971
ISBN-10: 9355432976
Publisher: Manjul Publishing House Pvt Ltd
Publication Date: June 21st, 2023
Pages: 282
Language: Telugu